శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (12:57 IST)

సినిమా రోడ్డున పడింది : బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి..?

బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా నుంచి కలర్‌, స్కోప్‌, 3డి వర్షన్‌ ఇలా టెక్నాలజీ మారుతున్న సినిమా మాత్రం రోడ్డున పడిందని సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ అంటున్నారు. పాత తరానికి సాక్షిగా నిలిచిన ఆయన ప్రస్తానం గురించి కొద్దిగా ముచ్చటించారు. సోమవారంనాడు ఆయన 69 ఏళ్ళకు ప్రవేశించాడు. తెలుగు సినిమారంగంలో ఇప్పటికీ నటిస్తున్న ఆయన అప్పటి బి.ఎన్‌.రెడ్డి, చక్రపాణి, విశ్వనాథ్‌ వంటి వారినుంచి ఎంతో నేర్చుకున్నాననీ, దైనందిక జీవితాలు కూడా తన కెరీర్‌కు ఉపయోగపడ్డాయని తెలియజేస్తున్నారు.
 
చంద్రమోహన్‌ అంటే... కొంతమందిలో ఓ భావం వుంది. అన్నింటిలో నిక్కచ్చిగా వుంటాడు. డబ్బువిషయంలోనూ, ప్రొడక్షన్‌ వ్యవహారాల్లోనూ భోజన విషయాల్లోనూ కొన్ని సందర్భాల్లో జూనియర్‌ ఆర్టిస్టులా బిహేవ్‌ చేస్తాడని విమర్శ వుంది. కానీ దాన్ని సద్విమర్శగా తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు. 
 
నాటకాలనుంచి వచ్చినవాడిని గనుక... సినిమాల్లో ప్రామిటింగ్‌ చేయడమనే ఆచారాన్ని తాను వ్యతిరేకించేవాడననీ, తోటి ఆర్టిస్టులకు ప్రామ్‌టింగ్‌ చేస్తుంటే చికాకు పుట్టేందని.. చాలామంది దర్శకులు మేథావులు వున్నా... సగానికి సగం మంది దర్శకత్వం విలువలు ఎలా వుండాలో తెలీని వారుకూడా వున్నారని వాపోతున్నారు. 
 
కథలుకూడా కుటుంబాలతో చూసేవి రావడంలేదని బాధను వ్యక్తం చేస్తూ... కళాకారుడిని ఎక్కువగా అటువంటి చిత్రాల్లో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్‌లో వుంటున్న ఆయన స్వర్గీయ శోభన్‌బాబు స్పూర్తితో అప్పట్లోనే ఆదాయాన్ని భూముల రూపంలో పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు.