శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 20 జనవరి 2015 (17:29 IST)

'నా పేరు రాజు' అంటున్న మెగా హీరో...!

ఒకప్పుడు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి 'నా పేరు రాజు' అంటూ దేవకన్యగా దివి నుంచి భువికి వచ్చిన శ్రీదేవికి పరిచయం చేసుకుంటాడు. ఆ కోవలో నేడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా 'నా పేరు రాజు' అంటూ తన తర్వాత సినిమాతో అభిమానుల ముందుకు దూసుకొస్తున్నాడు.
 
ఇక అసలు విషయానికొస్తే యంగ్ హీరో రామ్ చరణ్ నటించబోయే తదుపరి సినిమా గురుంచి అనేక వార్తలు వస్తున్నాయి. సరికొత్త కథతో ముందుకు రావాలని నిర్ణయించుకున్న ఈ మెగా హీరో చివరికి శ్రీనువైట్లతో ఫిక్స్ అయినట్లు సమాచారం. అంతేకాదు వీరిద్దరి కాంబినేషనల్‌లో వచ్చే సినిమాకు 'నా పేరు రాజు' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారట. ఈ సినిమా మార్చి నెలలో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్, ఇతర పాత్రల ఎంపిక పనులు జోరుగా సాగుతున్నట్టు సినీ వర్గాల సమాచారం.