గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 18 ఆగస్టు 2014 (21:02 IST)

వామ్మో... నేనెక్కిన వైజాగ్ విమానం 100 అడుగులు జారిపోయింది... ఛార్మి

విమానం ఎక్కాలంటేనే భయపడే రోజులు వచ్చేసినట్లున్నాయ్. సినీ నటి ఛార్మి జీవితంలో ఇవాళ ఊహించని ఘటన చోటుచేసుకుందట. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో తెలియజేసింది. ఈ క్షణం ఇలా అభిమానుల ముందు ఉన్నానంటే అంతా దేవుడి దయే అంటూ వణుకుతున్న చేతులతో రాసిందట. అసలేం జరిగిందంటే, ఛార్మి సోమవారం.... అంటే ఈరోజే ఇండిగో విమానం ఎక్కి వైజాగ్ వెళ్లిందట. వైజాగ్ విమానశ్రయంలో విమానం ల్యాండ్ అవడానికి ముందు ఒక్కసారిగా విమానం 100 అడుగులు కిందకి జారిందట. 
 
సీట్లకు ముందు ఉండే టీ ఇంకా ఇతర వస్తువులు అన్నీ కింద పడిపోయాయట. అంతే... విమానంలో ఉన్నవారి పైప్రాణాలు పైనే పోయినంత పైనందట. ఇక అంతా చనిపోతామనే భయంతో ఉండగా మరోసారి ఇండిగో విమానం మళ్లీ కిందికి జారిందట. ఇక ఇవే చివరి ఘడియలనీ, అంతా చచ్చిపోతామని అనుకునేలోపు పైలెట్ చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేశారనీ, ఇలాంటి భయంకర క్షణాలు ఎవరికీ ఎదురు కాకూడదని ఛార్మి తన ట్విట్టర్లో పేర్కొంది.