గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (11:42 IST)

త్రిష పెళ్లి వేడుకలో ఛార్మి డ్యాన్స్: అదిరిపోతుందట..!

ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ త్వరలో స్టేజ్ ఎక్కనుంది. ఇదేదో సినిమా వేడుకకు సంబంధించిన స్టేజ్ కాదు.. చెన్నై ముద్దుగుమ్మ త్రిష పెళ్లి వేడుకలో ఛార్మి సూపర్ డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసేందుకు రెడీ అవుతోంది. త్రిష-ఛార్మీ గుడ్ ఫ్రెండ్స్. ఇకపోతే.. ఇటీవల త్రిషకు ఎంగేజ్‌మెంట్ అయ్యింది.  
 
ఈ వివాహ నిశ్చితార్థం సందర్భంగా ఇచ్చిన పార్టీకి కూడా చార్మీ అటెండ్ అయింది. అలాగే, త్రిష పెళ్ళిలో ఆడిపాడుతూ సందడి చేస్తానని కూడా చెప్పిందట. ఏమైనా, ఇకపై త్రిషను చాలా మిస్సవుతాననీ, త్రిష కూడా తన బ్యాచిలర్ లైఫ్ మిస్సవుతుందనీ చార్మీ బాధగా చెబుతోంది.