శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (15:01 IST)

శ్రుతికి ఊరట... నటించడానికి రెడీ..! విలన్‌గా కమల్ హాసన్..!

పిక్చర్ హౌస్ మీడియా దాఖలు చేసిన కేసుపై సివిల్‌ కోర్టులో నటి శ్రుతి హాసన్‌కు ఊరట లభించింది. శ్రుతి హాసన్‌పై పిక్చర్ హౌస్ మీడియా వేసిన పిటిషన్‌ను సివిల్ కోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 17వ తేది జరిగిన ఈ కేసు విచారణలో కేవలం తన క్లైంట్‌ను వేధించేందుకే పిక్చర్ హౌస్ మీడియా ఆమెపై కేసు దాఖలు చేసిందని నటి శ్రుతి హాసన్ న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు.
 
ఈ సినిమాలో శ్రుతి హాసన్ స్థానంలో తమన్నా భాటియాను ఎంపిక చేశారని, షూటింగ్ కూడా జరుపుకుంటోందని ఆమె తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 20కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. విచారించిన కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అదేవిధంగా కొత్త సినిమాల్లో నటించేందుకు ఒప్పందం చేసుకోవద్దంటూ జారీచేసిన ఉత్తర్వులను కూడా కోర్టు రద్దుచేసింది. 
 
ఇదిలా ఉండగా... శ్రుహాసన్ తండ్రి, యూనివర్శల్ హీరో కమల్ హాసన్ మరో కొత్త కోణంలో తెరపై కనిపించనున్నారు. 'ఐ' చిత్రం తర్వాత శంకర్‌ 'రోబో-2'పై దృష్టిపెట్టాడు. మొదట రోబో సీక్వెల్‌లో హీరోగా పలువురు పేర్లు వినిపించినా తిరిగి రజినీకాంత్‌నే ఎన్నుకున్నాడు శంకర్‌. ఇక అదేస్థాయిలో ప్రతినాయకుడి పాత్ర కోసం కూడా పలువురు స్టార్లను పరిశీలించిన శంకర్‌ బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ను ఈ పాత్ర కోసం ఎంచుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. బిజీ షెడ్యూల్‌ కారణంగా అమీర్‌ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని తెలిసింది. 
 
తాజా సమాచారం ప్రకారం ఆయన స్థానంలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌‌ను ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కమల్‌ పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, రోబో చిత్రం షూటింగ్ సమయంలో సీక్వెల్‌ చేయాలని ఆలోచన వచ్చిందనీ, కొంత భాగం కూడా షూట్‌ చేశారని టాక్‌ కూడా విన్పిస్తోంది. కొత్తగా ఏడ్‌ అయ్యేది కమల్‌ పాత్రే. కెరీర్‌ ప్రారంభంలో ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.