గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (12:40 IST)

చిరంజీవి 150వ సినిమాలో శ్రీదేవి: జగదేకవీరుడితో అతిలోక సుందరి!

జగదేక వీరుడుతో అతిలోక సుందరి జతకట్టనుందని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ 150వ సినిమా ఇదిగో అదిగో అంటూ వార్తలొస్తున్నాయే తప్ప.. ఈ సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. ఇప్పటికే 24 క్రాప్ట్స్‌లోని కొన్ని విభాగాలకు ఎవరిని తీసుకోవాలి అనే క్లారిటితో ఉన్నారు. అలాగే కీలక పోస్ట్‌లకి సంబంధించిన టెక్నిషన్స్‌ని తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో చిరంజీవి 150 సినిమాలో హీరోయిన్‌ను ఎంపిక చేసే విషయంలో క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో జగదేక వీరుడి సరసన అతిలోక సుందరి నటించే అవకాశం ఉందని టాక్. దీనికి సంబంధించి శ్రీదేవితో మాట్లాడినట్లు, అందుకు శ్రీదేవి ఓకే అన్నట్లు అగ్రిమెంట్ కూడా జరిగినట్లు సమాచారం.