శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (12:57 IST)

మా ఎన్నికలు: రాజేంద్రప్రసాజ్-జయసుధల వార్.. చిరంజీవి, దాసరినే కారణమా?

''మా'' ఎన్నికలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించాయి. హోరాహోరీగా జరిగిన 'మా' ఎన్నికలు తెలుగు సినీ ఇండస్ట్రీలోని రెండు వర్గాల మధ్య జరిగిన పరోక్ష పోరని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ పోరులో సహజనటి జయసుధ, నటుడు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్ష పదవికి పోటీ పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ముందు నిలిచిన వారేనని, వీరి వెనుక మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావులు ఉన్నారని సమాచారం.
 
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పోటీలో దిగాక చిరంజీవి ప్రోద్బలంతోనే నాగబాబు మద్దతు తెలిపారని నిర్ణయించుకున్న దాసరి, తన పలుకుబడితో మురళీ మోహన్ ద్వారా జయసుధను రంగంలోకి దించారని తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్‌ను జయసుధ ఓడిస్తుందని మురళీ మోహన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయమై దాసరి ఇంకా స్పందించలేదు. 
 
కాగా, మా ఎన్నికలు ముగిసినప్పటికీ, కోర్టు తీర్పు వెలువడిన అనంతరమే ఫలితాలు బయటకు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఆదివారం మా అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో దాసరి నారాయణ రావు, చిరంజీవి పాత్ర ఉందని సినీ జనం అనుకుంటున్నారు. అందుకే మునుపెన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికలు వివాదాస్పదం అయ్యాయని.. రచ్చరచ్చగా మారిందని సమాచారం.