శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (19:18 IST)

హుదూద్ నష్టం పూడ్చలేనిది.. మేముసైతం అంటోన్న చిరంజీవి!

''ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సినీపరిశ్రమ ప్రజలకు అండగా వుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్‌ సందర్భంగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. పచ్చదనం పోయింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా...దాదాపు ప్రభుత్వలెక్కలప్రకారం 64మంది చనిపోయారు.
 
70వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఆ లోటును పూడ్చలేనిది. అందుకే మావంతు సహకారంగా 'మేము సైతం' కార్యక్రమంతో ముందుకు వస్తున్నామని'' నటుడు చిరంజీవి తెలియజేశారు. బుధవారం రాత్రి ఫిలింకల్చరల్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌, నిర్మాతలమండలి, ఛాంబర్‌ఆఫ్‌కామర్స్‌, తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌కామర్స్‌ ఆధ్వర్యంలో ఈనెల 30 ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఈ కార్యక్రమం చేపట్టారు. దానికి సంబంధించిన వివరాలను ముందుగా చిరంజీవి తెలియజేస్తూ... హుద్‌హుద్‌ తుఫాన్‌ సందర్భంగా ఎంతోమంది తమవంతు సాయాన్ని అందించారు. తమిళ పరిశ్రమకూడా అందించింది. ప్రతిఒక్కరినీ భాగస్వామి చేయడానికే మేముసైతం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ఇంకా ముందుగానే జరగాల్సివుంది. కానీ నటీనటుల డేట్స్‌ ఇబ్బందులవల్ల ఇప్పుడు జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 30న హైదరాబాద్‌లోని కోట్లవిజయభాస్కరెడ్డి స్టేడియంలో జరగనుంది. ఆరోజు ఉదయం 10 గంటలనుంచి రాత్రి 10గంటల వరకు పలు వినోదభరిత కార్యక్రమాలు నున్నాయి. మధ్యాహ్నం 3 గంటనుంచి 6గంటలవరకు క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. 
 
అక్కినేని నాగార్జున తెలుపుగూ.. 'డైన్‌విత్‌స్టార్‌' కార్యక్రమంలో భాగంగా 250 జంటలకు లక్షరూపాయల టిక్కెట్‌ను ఏర్పాటుచేశాం. వారు నటీనటులతో కలిసి ప్రోగ్రామ్‌లో మమేకం అవుతారని చెప్పారు. 
 
ఈ సందర్భంగా తొలి టిక్కెట్‌ను అల్లు అరవింద్‌ కొనుగోలుచేయగా, నటుడు అశోక్‌కుమార్‌, శ్రీనివాసరాజులు చెరోకటి కొనుగోలు చేశారు. అదేకాకుండా 'క్రికెట్‌ విత్‌స్టార్‌' అనే ప్రోగ్రామ్‌ కింద ప్రముఖ నటీనటులతో కలిసి పాలుపంచుకునేందుకు 3వేల రూపాయల టిక్కెట్‌ను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 'మెగా డ్రా', డైలీ క్విజ్‌, తంబోలా విత్‌స్టార్స్‌ అనే ప్రోగ్రామ్‌లుకూడా వున్నాయనీ, వాటి వివరాలను 'మేముసైతం.కామ్‌'ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 
 
ఇదేకాకుండా సుదూర ప్రాంతాలనుంచి తమ వంతు సాయం చేయాలనుకొనేవారు వెబ్‌సైట్‌లో వివరాలు ద్వారా పంపవచ్చని పేర్కొన్నారు.