శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (14:07 IST)

చిరంజీవి-రాజశేఖర్‌లు ఫ్రెండ్స్ అయిపోయారట!

చిరంజీవి-రాజశేఖర్‌లు ఫ్రెండ్స్ అయిపోయారట.. నిజంగానా అనుకుంటున్నారు కదూ.. అవునండి.. గత కొన్నాళ్లుగా చిరంజీవి పేరు చెబితే చాలు, డాక్టర్ రాజశేఖర్ అంతెత్తున లేచేవాడు. ఏమాత్రం సందర్భం దొరికినా రాజశేఖర్, జీవిత దంపతులు మెగాస్టార్‌పై పలు ఆరోపణలు చేస్తూ, విమర్శలకు దిగేవారు. 
 
అయితే, ఇప్పుడు వీరు స్నేహితులై పోయారట. తమ మధ్య విభేదాలు సమసిపోయాయని రాజశేఖర్ స్వయంగా చెప్పాడు. త్వరలో తమ ఇంట జరిగే ఫ్యామిలీ వేడుకకు చిరంజీవిని ఆహ్వానిస్తానని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. 
 
అవకాశం వస్తే మెగాస్టార్ నటించే సినిమాలో నటిస్తానని కూడా అంటున్నాడు. అన్నట్టు, ఈ హీరోల మధ్య విభేదాలు సమసిపోయేలా మెగా బ్రదర్ నాగబాబు చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం నడిపాడని తెలిసింది!