గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:44 IST)

'చూసినోడికి.. చూసినంత' ట్రైలర్స్‌, సాంగ్స్‌ చూస్తుంటే...?

పి.యస్‌.ఆర్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై అనీల్‌ వాటుపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పి.శ్రీనివాసరావు నిర్మిస్తున్న 'చూసినోడికి చూసినంత' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. 
 
శివాజి, నిత్య, లెజ్లీ త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణుడు, నాగబాబు,  పృథ్వి, ప్రభాస్‌ శ్రీను, చిత్రం శ్రీను, అంబటి శ్రీను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం ఆడియోను మ్యాంగో మ్యూజిక్‌ మార్కెట్‌ చేస్తోంది.

రచయిత కోన వెంకట్‌, నిషాకొఠారి ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ఆడియో వేడుకలో నిర్మాత పి.శ్రీనివాసరావు, దర్శకుడు అనీల్‌ వాటుపల్లి, హీరో శివాజి, హీరోయిన్లు నిత్య, లెజ్లీ త్రిపాఠి, సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌, ముఖ్యపాత్రధారుల్లో ఒకరైన కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. బిగ్‌ సీడిని కోన వెంకట్‌ ఆవిష్కరించగా, ఆడియోను నిషా కొఠారి విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా కోన వెంకట్‌ మాట్లాడుతూ... 'ఇండస్ట్రీని నిలబెడుతున్నవి చిన్న సినిమాలే తప్ప, పెద్ద సినిమాలు కానే కావు. నేను స్వతహా చిన్న సినిమాల పక్షపాతిని, పరిమితుల మధ్య పని చేస్తున్నప్పుడే సృజనాత్మకత పూర్తిస్థాయిలో వెలికి వస్తుంది. 'చూసినోడికి చూసినంత' ట్రైలర్స్‌, సాంగ్స్‌ చూస్తుంటే... ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది' అన్నారు.
 
'చూసినోడికి చూసినంత' చిత్రం ఆడియో ఫంక్షన్‌లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్నిస్తోందని చెప్పిన నిషాకొఠారి, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో నటించడం పట్ల హీరోయిన్లు నిత్య, లెజ్లీ ఆనందం వ్యక్తం చేయగా- శివాజి కాంబినేషన్‌లో తాను నటిస్తున్న రెండో చిత్రమిదని కృష్ణుడు అన్నారు.
 
'అయ్యారే' అనంతరం శివాజి సినిమాకు తాను సంగీతాన్నందించిన 'చూసినోడికి చూసినంత' పాటలు కూడా చాలా చక్కగా కుదిరాయని సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. 
 
ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న అనిల్‌కి ఉజ్వలమైన భవిష్యత్‌ ఉందని హీరో శివాజీ పేర్కొన్నారు. సరైన రీతిలో ప్రచారం చేసి, ప్రేక్షకులకు చేరువ చేస్తే కచ్చితంగా ఘన విజయం సాధించే చిత్రమిదన్నారు. 
 
సునీల్‌ కశ్యప్‌ తన కెరీర్‌ బెస్ట్‌ సాంగ్స్‌ ఇచ్చాడని.. హీరో శివాజి, ప్రొడ్యూసర్‌ పి.శ్రీనివాసరావులతోపాటు యూనిట్‌ మెంబర్స్‌ అందరూ ఎంతో కోపరేట్‌ చేయడంతో సినిమా అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందని దర్శకుడు అనీల్‌ వాటుపల్లి అన్నారు. ఈ కార్యక్రమానికి సంయుక్త వ్యాఖ్యాతగా వ్యవహరించారు.