శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 18 డిశెంబరు 2014 (16:06 IST)

చక్రి ఇంటి ముందు నిర్మాతలు... మా అడ్వాన్సులు మాకిచ్చేయండి...

సంగీత దర్శకుడు చక్రి అకాలమరణం కుటుంబ సభ్యులకు జీర్ణించుకోలేకుండా చేస్తే... ఇండస్ట్రీలో మాత్రం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అందరితో అన్యోన్యంగా వుండే చక్రి కుటుంబంలో కొన్ని గొడవలు జరిగిన మాట వాస్తవమేనని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. కాగా, ఆస్తుల పంపకాల విషయలో భార్య శ్రావణికి, కుటుంబసభ్యులకు మధ్య గొడవలు జరగడం.. దాన్ని తమ్మారెడ్డి భరద్వాజ మీడియేటర్‌గా వుండటం ఆమధ్య వార్తలుగా వచ్చాయి.
 
ఇదిలావుండగా... గురువారంనాడు ఉదయమే నలుగురు నిర్మాతలు ఆయన ఇంటికి వెళ్ళి తమకు రావాల్సిన డబ్బులు వాపసు ఇవ్వమని కోరినట్లు తెలిసింది. చక్రి కొత్తగా ఐదు చిత్రాల్లో సంగీతాన్ని అందించడానికి నిర్మాతలు ముందుగా అడ్వాన్స్‌లు ఇచ్చారు. అందులో మూడు చిత్రాలకు ట్యూన్స్‌ సగం పూర్తయ్యాయి. మిగిలిన రెండు చిత్రాలకు ఇంకా చేయాల్సి వుంది.
 
అయితే... చక్రికి లైఫ్‌ ఇచ్చిన ఓ సింగర్‌ తమ గురువుగారికి ఇటువంటి పరిస్థితి రావడంతో విషయం తెలిసి సోదరుడు మహిత్‌తో సంప్రదించి... శ్రావణి వద్ద కూడా పూర్తి వివరాలు తెలుసుకుని... వారికి రావాల్సిన మొత్తంలో కొంత ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రకంగా చక్రి మరణం తర్వాత తాము రావడం తప్పని పరిస్థితి అని వారు బాధను వ్యక్తం చేస్తున్నారట.