శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (17:53 IST)

'హైదర్' చిత్రం నా జీవితాన్ని మార్చేస్తుంది : శ్రద్దా కపూర్

ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా తన జీవితాన్నే మార్చేస్తుందని అంటోంది శ్రద్దా కపూర్‌. విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'హైదర్‌' సినిమా గురించి ఈ బాలీవుడ్‌ బ్యూటీ చెబుతోంది. 
 
'ఈ సినిమా షూటింగ్‌ చేస్తుంటే ఓ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నాను. సెట్స్‌లో తొలిసారిగా ఇలాంటి ఫీలింగ్‌ కలుగుతుంది. ఓ భిన్నమైన ప్రపంచంలో ఉన్నట్లుగా కలుగుతోంది. ఈ సినిమా నన్ను, నా జీవితాన్నీ మార్చేసేలా వుంది' అంటోంది శ్రద్దా. 
 
ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత షేక్స్‌పియర్‌ రాసిన 'హేమ్లెట్‌' నాటిక ఆధారంగా విశాల్‌ దీనిని రూపొందిస్తున్నాడు. ఇందులో టబు, షాహిద్‌ కపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ జమ్ము కాశ్మీర్‌లో జరుపుకుంటోంది.