మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (15:37 IST)

వైభవంగా ఆస్కార్ అవార్డుల వేడుక.. ఉత్తమ చిత్రం బర్డ్‌మేన్...!

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. 87వ సారి జరుగుతున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  
 
ఈ ఏడాదికిగాను ఉత్తమ నటుడిగా ఎడీ రైడ్‌మైన్, ఉత్తమ నటిగా జూలియన్ మోరేలు ఆస్కార్‌ను అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా బర్డ్‌మోన్ ఎంపికైంది. ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’  చిత్రానికి నాలుగు విభాగాల్లోను, ‘వివ్‌లాష్’, ‘బర్డ్ మ్యాన్’ చిత్రాలు మూడు విభాగాల్లోను ఆస్కార్ పురస్కారాలను అందుకున్నాయి.
 
లాస్ ఏంజిల్స్‌ జరిగిన 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలకు ప్రపంచంలోని పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తమ నటుడు - ఎడ్డీ రైడ్‌ మైన్ (ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్),  ఉత్తమ నటి - జూలియన్ మోరే (స్టిల్ ఎలైన్), ఉత్తమ సహాయ నటుడు - జేకే సిమన్స్ (వివ్‌లాష్), ఉత్తమ సహాయనటి - పెట్రిసియా ఆర్కెట్ (బాయ్‌హుడ్) పురస్కారాన్ని అందుకున్నారు. 
 
అదేవిధంగా ఉత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిలిం - బిగ్ హీరో 6 (డాన్ హాల్, క్రిస్ విలియమ్స్, రాయ్ కాన్‌లీ), ఉత్తమ సినిమాటోగ్రఫీ - బర్డ్ మ్యాన్ (ఇమ్మాన్యుల్ లుబేకీ), ఉత్తమ వస్త్రాలంకరణ - మెలెనా కనోనెరో (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్), ఉత్తమ దర్శకుడు - అలెజాన్డ్రో జి. ఇరినాట్ (బర్డ్ మ్యాన్), ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ - వివ్‌లాష్ (ట్రామ్ క్రాన్) ఆస్కార్ అందుకున్నారు.
 
ఉత్తమ విదేశీ చిత్రం - ఐడా (పోలండ్), ఉత్తమ ముఖ, కేశాలంకరణ - ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఫ్రాన్సిస్ హసన్, మార్క్ కౌలీ), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - డి గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఆడమ్ స్టాక్ హాసెన్, అనా పినాక్), ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ - అమెరికన్ స్నైపర్ (అలన్ రాబర్ట్, ముర్రే, బబ్ ఆస్మాన్), ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - వివ్‌లాష్ (క్రేగ్‌మన్, బెన్ విల్కిన్స్, థామస్ క్యూర్‌లీ), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - ఇంటర్ స్టెల్లార్ (పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్లీ, ఐస్ హంటర్, స్కాట్ ఫిషర్)లు అవార్డును చేజిక్కించుకున్నారు. 
 
అలాగే ఉత్తమ సంగీతం  (ఒరిజినల్ స్కోర్) - అలెక్సాండ్రీ డెన్‌ప్లాట్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్), ఉత్తమ స్క్రీన్ ప్లే - బర్డ్ మ్యాన్, ఉత్తమ డాక్యుమెంటరీ - క్రైసిస్ హాట్ లైన్ - వెటరన్ ప్రెస్ 1 (ఎలిస్ గూసెన్‌బర్గ్ కెంట్, డానా పెర్రీ), ఉత్తమ షార్ట్ ఫిలిం - ది ఫోన్ కాల్‌లు ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్నారు.