మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: బుధవారం, 16 జులై 2014 (22:52 IST)

డి.సురేష్ బాబు 3 వేల ఎకరాలు... సినిమా పరిశ్రమ తడకే తరలిపోతుంది

రాష్ట్రం రెండుగా విడిపోయాక రాజకీయరంగంలో పలు సంస్థలు రెండుగా విడిపోయాయి. అయితే చలనచిత్రరంగంపై ఆ ప్రభావం కూడా ఉంటుందని భావించినా.. ఇంత త్వరగా ఉంటుందని ఊహించలేదు. గత కొద్దిరోజులుగా అనేక సంఘాలు తెలంగాణ సినిమాలో వెలిశాయి. దాంతో ఫిలిం ఛాంబర్‌ను కూడా రెండుగా విభజించి.. మా ఆస్తి మాకు పంచమని గొడవ చేసిన సంఘటనలు జరిగాయి. ఈ వివాదాల అనంతరం డి.సురేష్ బాబు చక్కటి క్లారిటీ ఇచ్చాడు.
 
ఇండస్ట్రీ అనేది శాశ్వతంగా హైదరాబాద్‌లో ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వైజాగ్‌, విజయవాడ, తడ వంటి ప్రాంతాల్లోనూ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే వైజాగ్‌లో రామానాయుడు స్టూడియో ఉంది. అయితే రామోజీ ఫిలింసిటీ తరహాలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో కట్టాలని ఎప్పటి నుంచో ప్లాన్‌ చేస్తున్నారు. భవిష్యత్‌ తరాలు చెప్పుకోదగిన విధంగా ఆంధ్రలో ఉండాలని 99శాతం సినిమాలు తీసే నిర్మాతలు పట్టుపడుతున్నారు. దాంతో... సినిమా నిర్మాణానికి ప్రతి విషయానికి చెన్నై వెళ్ళి రావాల్సి ఉన్నందున...  తడ అందుకు అనుకూలంగా ఉంటుందని,.. భావించి అక్కడ స్టూడియోలు కట్టాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
తడలో చాలా స్థలం ప్రభుత్వపరంగా ఉంది. నెల్లూరు జిల్లా పులికాట్‌ సరస్సు కూడా చాలా దగ్గరగా ఉంది. నీటి ఇబ్బంది లేదు. ఏదైనా సమస్య వస్తే చెన్నైకు చాలా దగ్గరలో ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి... డి.సురేష్‌ బాబు ప్రముఖులతో కలిసి అక్కడ 3 వేల ఎకరాలను కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రామోజీ ఫిలింసిటీ తరహాలో అన్ని సెట్లు, వేసేసి స్టూడియోను తీర్చిదిద్దాలని ప్లాన్‌లో ఉన్నాడట. కృష్ణపట్నం పోర్టు కూడా అక్కడే ఉండటంతో భవిష్యత్‌లో బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుందని తెలుస్తోంది. సో.... తెలంగాణలో ఇండస్ట్రీ అనేది ఉంది అని భవిష్యత్‌లో చెప్పుకోవడానికి గుర్తుగా ఉంటుందన్నమాట. ఏది ఏమైనా ఇదంతా అయ్యేసరికి ఐదేళ్ళు పట్టవచ్చని.. డి.సురేష్‌ బాబు చూచాయగా చెబుతున్నారు.