శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 అక్టోబరు 2014 (15:20 IST)

టాలీవుడ్ లో రౌడీయిజం... రామ్ చరణ్ సినిమాపై దాసరి కామెంట్...?

దాసరి నారాయణ రావు మళ్లీ మొదలుపెట్టారు. ఈసారి నేరుగా అనకపోయినా పరోక్షంగా కామెంట్లు విసిరారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీయిజం పెరిగిపోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాల భవిష్యత్ పెద్ద సినిమా నిర్మాతల కాళ్ల కింద నలిగిపోతోందంటూ పేర్కొన్నారు. 
 
లక్ష్మీ రావే మా ఇంటికి అనే సినిమా ఫంక్షన్లో అతిథిగా పాల్గొన్న దాసరి ఈ వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకీ పెద్ద చిత్రాల నిర్మాతల అణచివేత ఎక్కువవుతోందని, చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారన్నారు. 
 
ఓ పెద్ద హీరో సినిమా కోసం దసరా పండుగ నాడు 'లౌక్యం' సినిమాను తప్పించారనీ, ఐతే ఆ పెద్ద సినిమా పట్టుమని మూడు రోజులు కూడా ఆడకుండా పోయిందంటూ కామెంట్లు విసిరారు. పెద్ద సినిమా... దసరా పండుగ అంటే... రామ్ చరణ్ గోవిందుడు అందరివాడెలే చిత్రమే కదా...?