గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 23 అక్టోబరు 2014 (18:33 IST)

దాసరి కామెంట్స్.... మెగా ఒత్తిడితో వివరణ ఇచ్చుకున్నారా...?

‘లక్ష్మీ రావే మాయింటికి' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు, టాలీవుడ్‌లో రోజు రోజుకు రౌడీయిజం పెరిగిపోతుందన్నారు. చిన్న చిత్రాలు, వాటి నిర్మాతలు కొందరి పెద్దల రౌడీయిజానికి నలిగిపోతున్నారనీ, మంచి కలెక్షన్స్‌తో నడుస్తోన్న ‘లౌక్యం' చిత్రాన్ని ఒక పెద్ద సినిమా కోసం దాదాపు 30 థియేటర్ల నుండి తొలగించారని మండిపడ్డారు. కానీ ఆ పెద్ద చిత్రం మూడు రోజుల కంటే ఎక్కువగా ఆ చిత్రం థియేటర్లలో నిలువలేదంటూ దాసరి వ్యాఖ్యానించిన విషయం విదితమే.
 
దాసరి వ్యాఖ్యలు సూటిగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే చేసినవంటూ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రంపైనే ఆయనలా మాట్లాడి ఉంటారని మీడియా కోడై కూసింది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో దాసరి మాట్లాడుతూ... తన వ్యాఖ్యలు వారి గురించి కాదని స్పష్టం చేశారు. నేను మాట్లాడిన మాటలను వ్యక్తులకు ఆపాదించి రాయవద్దంటూ విజ్ఞప్తి చేశారు.