శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (20:31 IST)

విజయ్ 'కత్తి'పై కొత్త కేసు... పవన్ కళ్యాణ్‌ 'కత్తి'ని చూస్తారో లేదో...?

మురుగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం 'కత్తి' విడుదల ముందు అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ దీపావళికి విడుదలై సూపర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్లతో ప్రదర్శించబడుతోంది. ఐతే ఈ చిత్రానికి కోర్టు కష్టాలు వచ్చినట్లు కోలీవుడ్ న్యూస్. 
 
ఎందుకంటే ఈ చిత్రంలో 2జి స్కాం ప్రస్తావన ఉండటం మూలంగా ఈ చిత్రంపై మధురైకి చెందిన న్యాయవాది రామసుబ్రహ్మణ్యం కోర్టులో కేసు వేశారు. 2జి స్కాం ఇంకా విచారణ దశలో ఉండగానే ఆ అంశాన్ని లేవనెత్తడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్రానికి సంబంధించిన హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థపై కేసులు వేశారు. 
 
మరోవైపు 'కత్తి' చిత్రాన్ని ఈ రాత్రికి పవన్ కళ్యాణ్ చూస్తారని అనుకుంటున్నారు. ఈ స్థితిలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో పవన్ కత్తిని చూస్తారో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి. 

కాగా 'కత్తి' చిత్రం మంచి విజయాన్ని చేజిక్కించుకోవడంతో ఈ చిత్రం డబ్బింగ్‌ రైట్స్‌ను తెలుగులో 'ఠాగూర్‌' నిర్మించిన మధు పొందాడు. ఈ చిత్రంలోని పాయింట్‌ చిరంజీవికి సరిగ్గా సరిపోతుందని గీతా ఆర్ట్స్‌ భావించడంతో ఆయనతో చేయాలని గీతా ఆర్ట్స్‌ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఠాగూర్‌ మధు.. గీతా ఆర్ట్స్‌కు బాగా కావాల్సిన వ్యక్తి.
 
అయితే చిత్రంలో కంటెంట్‌... రైతుల నేపథ్యంతో పాటు సామాజిక అంశాలు కూడా వుండటంతో చిరంజీవి 150 చిత్రానికి సరిగ్గా సరిపోతుందని అల్లుఅరవింద్‌ భావించినట్లు గీతా ఆర్ట్స్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
కానీ అందులోనే పవన్‌ అభిమానులు మాత్రం.. పవన్‌ కళ్యాన్‌కు సరిపోతుందని ఆలోచన రేకెత్తించడంతో.. అసలు ఈ సినిమాలో విషయం వుందా? లేదా? అనేది పవన్‌ స్వయంగా తెలుసుకోవాలని చూశారు. మంగళవారం రాత్రి ఈ చిత్రాన్ని చూడ్డానికి హైదరాబాద్‌లో ప్రత్యేక షో ఏర్పాటు చేసినట్లు సమాచారం. 
 
ఆ చిత్రం చూశాక నచ్చితే చేయాలనే ఆలోచనలో ఉండబట్టే ఆయన సినిమా చూస్తున్నట్లు ప్రసాద్‌ ల్యాబ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఆ సినిమాను ఆయన అక్కడే చూడబోతున్నారు. ఇప్పటికే మీడియా అక్కడ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. 
 
కాగా, ఠాగూర్‌ మధు 'కత్తి' చిత్రం డబ్బింగ్‌ హక్కులు పొందారే కానీ, రీమేక్‌ హక్కులు పొందలేదని తెలిసింది. దాంతో ఆయనకు పోటీగా ముగ్గురు ముందుకు వచ్చారు. అది మంగళవారం నాడు తేలనుందని టాక్‌ ప్రచారంలో వుంది. ఏదైనా ఈ రాత్రికి అసలు విషయం తెలియనుంది.