గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (11:50 IST)

4 గెటప్స్‌లో పరదేశి హీరోయిన్.. హాలీవుడ్ ఆఫర్ కూడా!

తమిళ కథానాయిక ధన్సిక 'పరదేశి' వంటి అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయురాలే. ప్రస్తుతం ఈ చిన్నది ఒకే సినిమాలో నాలుగు గెటప్స్ వేయనుంది. ప్రముఖ దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందే 'కిట్నా' చిత్రంలో ధన్సిక కథానాయికగా ఎంపికైంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందే ఈ సినిమాలో తాను నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తానని చెప్పింది. 
 
ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీ ఇంచుమించు ద్విభాషా, త్రిభాషా చిత్రాలేనని తెలిపింది. మరో విశేషం ఏమిటంటే, త్వరలో ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్‌‌కి కూడా వెళుతోంది. "హాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా వివరాలు వెల్లడిస్తానని చెబుతోంది.