మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 27 నవంబరు 2014 (15:28 IST)

సాయిధరమ్‌ తేజ్‌, హరీష్‌ శంకర్‌, దిల్‌ రాజుల 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' ప్రారంభం

'పిల్లా నువ్వులేని జీవితం' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా, గ్లామరస్‌ రెజీనా హీరోయిన్‌గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'. ఈ సినిమా  ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహర్తపు సన్నివేశానికి స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్లాప్‌ కొట్టగా, ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. 
 
హీరో సాయిధరమ్‌ తేజ్‌పై ముహుర్తపు తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. తొలి సన్నివేశానికి సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు,  శిరీష్‌, లక్ష్మణ్‌, హర్షిత్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌.ఎస్‌, తదితరులు పాల్గొన్నారు. 
 
అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో... హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''మేము, గీతాఆర్ట్స్‌ బ్యానర్‌ కలిసి చేసిన పిల్లా నువ్వులేని జీవితం పెద్ద సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మా బ్యానర్‌లో సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ చిత్రాన్ని సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నిర్మిస్తున్నాం. ఈ చిత్రాన్ని రామయ్యా వస్తావయ్యా చిత్రం తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శత్వంలో నిర్మిస్తున్నాం. హరీష్‌  శంకర్‌ స్టయిల్‌లో ఈ సినిమా డిఫెరెంట్‌ ఎంటరట్‌టైనర్‌గా రూపొందనుంది. 
 
ఈ సినిమాతో సాయిధరమ్‌కి తొలిప్రేమ సినిమాతో పవన్‌ కల్యాణ్‌గారికి, ఆర్యతో బన్నికి ఎంత యూత్‌ఫుల్‌ ఇమేజ్‌ వచ్చిందో అంతటి ఇమేజ్‌ వస్తుంది. పక్కా మాస్‌ సినిమా. హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో డిసెంబర్‌, జనవరి, ఫ్రిభవరిలో షూటింగ్‌ చేస్తాం. తర్వాత ఏప్రిల్‌లో యు.ఎస్‌లో కొంత పార్ట్‌ చిత్రీకరణ పూర్తి చేసి సమ్మర్‌లో అంటే మే నెలలో సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం.'' అన్నారు. 
 
దర్శకుడు హరీష్‌ శంకర్‌.ఎస్‌ మాట్లాడుతూ - ''శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ను నా హోమ్‌ బ్యానర్‌లా ఫీలవుతుంటాను. మరోసారి దిల్‌రాజు అన్నయ్యతో కలిసి సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. మిరపకాయ్‌ కంప్లీట్‌ అయిన తర్వాత ఈ కథను అనుకున్నాను. అప్పటికి ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చెయ్యలేదు. గబ్బర్‌సింగ్‌ టైమ్‌లో పవన్‌ కళ్యాణ్‌గారి ఇంట్లో తేజను బర్త్‌డేకి కలిశాను. అప్పుడు తనకి అట్రాక్ట్‌ అయ్యాను. అప్పుడు కూడా తనతో సినిమా చేయాలనుకోలేదు. తర్వాత రేయ్‌, పిల్లా నువ్వులేని జీవితం సినిమాల ప్రోమోస్‌ చూసినప్పుడు తేజుకైతే ఈ సినిమా బాగుంటుందని, ఈ స్క్రిప్ట్‌పై వర్కవుట్‌ చేశాను. తర్వాత తేజుని కలిసి కథ చెప్పాను తనకి బాగా నచ్చింది. 
 
ఈ సినిమాతో తేజుని ఫుల్‌ లెంగ్త్‌ కమర్షియల్‌ హీరోగా చూపించాలనుకుంటున్నాను. క్లాస్‌, మాస్‌ సహా అందరికీ నచ్చే విధంగా, లవ్‌ స్టోరితో పాటు అన్నీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా తేజుని క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశాను. ఈ సుబ్రమణ్యం క్యారెక్టర్‌ తేజుకి గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో రామ్‌ప్రసాద్‌గారితో కలిసి మళ్లీ పనిచేస్తున్నాను. అలాగే సినిమాకి మిక్కి జె మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ అల్రెడి ప్రారంభమయ్యాయి. రాజు అన్నయ్య చెప్పినట్టు డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి ఇక్కడ షూటింగ్‌, ఏప్రిల్‌లో యు.ఎస్‌లో కొంతభాగం టాకీ, రెండు సాంగ్స్‌ షూట్‌ చేస్తాం. మే నెలలో రిలీజ్‌ అనుకుంటున్నాను. తేజుకి ఈ సినిమా నెక్ట్స్ లెవల్‌ మూవీ అవుతుంది'' అన్నారు.  
 
యంగ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ మాట్లాడుతూ - ''నా రెండో సినిమా పిల్లా నువ్వులేని జీవితం తర్వాత దిల్‌రాజుగారి బ్యానర్‌లోనే మరో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే హరీష్‌ అన్నయ్యకి కూడా పిల్లా నువ్వులేని జీవితం సినిమా కంటే ముందుగానే ఈ సినిమా నాతో చేస్తానని డిసైడ్‌ అయ్యారు. ఈ సినిమాతో బిఫోర్‌ హరీష్‌ సినిమా, ఆఫ్టర్‌ హరీష్‌ సినిమాలా నాకు పేరు వస్తుందని అనుకుంటున్నాను'' అన్నారు.
 
నిర్మాత హర్షిత్‌ మాట్లాడుతూ '' మా బ్యానర్‌లో  సాయిధరమ్‌ తేజ్‌తో చేస్తున్న రెండో సినిమా. ఇది కూడా పెద్ద సక్సెస్‌ అవుతుంది. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు. 
 
సాయిధరమ్‌తేజ్‌, రెజినా, సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావురమేష్‌, పృథ్వి, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, వెంకట్‌, ఆర్ట్‌: రామకృష్ణ, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, సతీష్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, కో-ప్రొడ్యూసర్స్‌: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ ఎస్‌.