శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: ఆదివారం, 31 ఆగస్టు 2014 (20:23 IST)

ప్రముఖ దర్శకుడు 'బాపు' కన్నుమూత... శోకంలో టాలీవుడ్

తెలుగు వెండితెర ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు 'బాపు' ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 80 ఏళ్ల బాపు పూర్తి పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఆయన 1933 డిసెంబర్ 15న వేణుగోపాల రావు, సూర్యకాంతమ్మలకు జన్మించారు. 'సాక్షి' తొలి చిత్రంతో దర్శకునిగా పరిచయమైన బాపు చివరి చిత్రం 'శ్రీరామ రాజ్యం'. ఈ శ్రీరామ రాజ్యం సినిమా షూటింగ్ సమయంలోనే మిత్రుడు, రచయిత ముళ్లపూడి వెంకట రమణ కన్నుమూశారు.
 
బాపు, రమణల ద్వయం వెంటవెంటనే పరమపదించడంపై తెలుగు సినీ పరిశ్రమ శోకంలో మునిగిపోయింది. బాపు 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. రెండు సార్లు జాతీయ పురస్కారాలతోపాటు 5 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. 1986 సంవత్సరంలో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు, 2013లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.