గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (15:25 IST)

కత్తి హీరో విజయ్ సోషియో ఫాంటసీ మూవీలో డబుల్ యాక్షన్!

''కత్తి'' హీరో డబుల్ యాక్షన్ చేసేందుకు సిద్ధమయ్యారు. కత్తి బంపర్ హిట్ కావడంతో తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్న తమిళ హీరో విజయ్, శింబుదేవన్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నాడు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
 
గతంలో 'విచిత్రసోదరులు' చిత్రంలో కమల్ చేసిన మరుగుజ్జు పాత్ర ఛాయల్లో విజయ్ డబుల్ రోల్ వుంటుందని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ మాస్ హీరో అయివుండి ఇలాంటి ప్రయోగం చేయడానికి విజయ్ ముందుకు రావడం నిజంగా సాహసమని సినీ పండితులు చెబుతున్నారు. ఈ భారీ బడ్జెట్టు సినిమాలో శ్రీదేవి మహారాణి పాత్రను పోషిస్తుండగా, ఆమె కూతురు యువరాణి పాత్రలో హన్సిక కనిపిస్తుంది.