శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 జనవరి 2015 (18:22 IST)

రజనీకాంత్ ఇమేజ్‌ను డిస్ట్రిబ్యూటర్స్ డామేజ్ చేశారు!

ప్రముఖ నటుడు రజనీకాంత్ ఇమేజ్‌ను డామేజ్ చేశారని లింగ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ డిస్ట్రిబ్యూటర్లపై ఆరోపణలు గుప్పించారు. డిస్ట్రిబ్యూటర్లే లింగా చిత్రాన్ని నష్టపరిచారని విమర్శించారు. లింగా చిత్రం తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆ చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకుని పరిహారం ఇప్పించాలని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు కొందరు గగ్గోలు పెడుతూ దానికి పరాకాష్టగా శనివారం చెన్నైలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టి కలకలం సృష్టించారు. 
 
దీనికి స్పందించిన ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను నిర్మించిన లింగా చిత్రం విడుదల హక్కులను ఇరాస ఎంటర్ టైన్‌మెంట్ సంస్థకు విక్రయించగా, వారి నుంచి వేందర్‌మూవీస్ ఆ హక్కులను పొందిందని, ఆ సంస్థ నిర్వాహకులు వారికి తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించడం జరిగింది.
 
అయితే నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తనను కానీ, రజనీకాంత్‌ను కానీ కలిసి పరిస్థితిని వివరిస్తే వారికి తప్పక వివరిస్తే వారికి తప్పక న్యాయం చేసేవాళ్లం అన్నారు. అలాకాకుండా తిరుచ్చి ఏరియా డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్, ఇతర డిస్ట్రిబ్యూటర్లను రెచ్చగొడుతున్నారన్నారు. తాను రూ. 220 కోట్లు దోచుకున్నట్లు నిరూపిస్తే వారి నష్టాన్ని ఇప్పుడే సెటిల్ చేస్తానని లేదంటే సింగారవేలన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.