గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (12:56 IST)

''మేము సైతం'': 30న బ్రహ్మానందం స్పెషల్ కామెడీ షో!

తెలుగు సినిమా రంగం యావత్తు కలసి హైదరాబాదులో ఈ నెల 30న నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమంలో పాల్గొనడానికి తారలు ఎవరికి వారు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ తమ కార్యక్రమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. 
 
ఈ క్రమంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా తమ స్టయిల్‌లో అలరించడానికి రెడీ అవుతున్నాడు. తానొక్కడే ఓ కామెడీ షో చేయడానికి ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. సుమారు అరగంట పాటు ఆయన కామెడీ షో రన్ అవుతుందనీ, ఇది ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందనీ అంటున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా తానే సిద్ధం చేసుకున్నాడట.