శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (12:26 IST)

బాహుబలిలో అనుష్క లేదట.. ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న హిస్టారికల్ మూవీ బాహుబలి సినిమాలో అనుష్క లేదనే వార్త ఆమె అభిమానులకు మాత్రం కాస్త షాకింగ్ న్యూస్‌ను ఇస్తోంది. అయితే ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని సినీ యూనిట్ అంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సమ్మర్లో రిలీజ్ అయ్యే ఈ సినిమా బాహుబలి పార్ట్-లో మాత్రం అనుష్క పాత్ర వుండదట. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ వేసవిలో విడుదలయ్యే ఈ సినిమా 'పార్ట్ 1'లో మాత్రం ఈ అందగత్తె పాత్ర వుండదట. దాంతో ఆమె మొదటి భాగంలో కానరాదనీ, రెండో భాగంలో మాత్రం ఆమె పూర్తిగా ఉంటుందనీ అంటున్నారు. 
 
ఇక తొలి భాగంలో ప్రభాస్ సరసన కథానాయికగా తమన్నా కనిపిస్తుందట. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. తొలి భాగం రిలీజైన రెండు మూడు నెలలకు రెండో భాగాన్ని రిలీజ్ చేస్తారు.