శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2014 (10:17 IST)

రాం గోపాల్ వర్మ సంక్రాంతికి ''స్పాట్'' రిలీజ్ చేస్తున్నాడట!

రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న స్పాట్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ పూర్తయ్యిందని, మూడో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుందని సినీ యూనిట్ తెలిపింది. రక్తచరిత్ర వెనుకగల అసలు చరిత్రను ఇందులో వర్మ చూపిస్తున్నాడు.
 
ఓబుల్ రెడ్డికి పరిటాల రవి పెట్టిన యథార్థ స్పాట్‌ని ఇందులో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల వర్మతో 'ఐస్ క్రీమ్' సీరీస్ చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ దీనిని భీమవరం టాకీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భారీ సినిమాలతో పోటీ పడడానికి వర్మ రెడీ అవుతున్నాడు. మరి స్పాట్ సినిమా సంక్రాంతికి ఎలాంటి రెస్పాన్స్ చవిచూస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే వర్మ ఫస్ట్ లుక్ రిలీజైంది.