మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: సోమవారం, 21 జులై 2014 (19:58 IST)

'గెడ్డం గ్యాంగ్‌' మంచి పేరు తెస్తుందట...

డా. రాజశేఖర్‌ ప్రధానపాత్ర పోషిస్తున్న చిత్రం 'గడ్డెం గ్యాంగ్‌'. ఓ విజయవంతమైన చిత్రానికి రీమేక్‌. తమిళ దర్శకుడే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నలుగురు అనుచరులతో సమాజంలో జరిగిన అరాచకాలను అడ్డుకట్ట వేసే పాత్రలో రాజశేఖర్‌ నటిస్తున్నారు. ఈచిత్రంలోకి కీలక సన్నివేశాలను నానక్‌రామగూడ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.
 
కోర్టు నుంచి బయటవచ్చి పారిపోయే సన్నివేశంలో పోలీసులు అడ్డుకునే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వంత బేనర్‌లో జీవిత నిర్మిస్తున్నారు. ఆమె కుమార్తెలు నిర్మాతలు. ప్రతి సన్నివేశాన్ని దగ్గరుండి చూసుని జీవిత చేయిస్తున్నారు. రాజశేఖర్‌కు చాలా కాలం గ్యాప్‌ తర్వాత ఈ చిత్రం మంచి పేరు తెస్తుందని జీవిత తెలియజేస్తున్నారు.