శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (15:34 IST)

శ్మశానంలో కూర్చొంటే మంచి థాట్ వచ్చి "టూ లెట్" కథ రాశా.. సూపర్ హిట్!

ఒక రోజున శ్మశానంలో కూర్చొని ఆలోచిస్తుంటే మంచి థాట్ వచ్చి "గీతాంజలి" చిత్ర కథను రాశానని దర్శకుడు రాజ్‌కిరణ్ చెపుతున్నాడు. ఈ చిత్రం మంచి టాక్‌తో నడుస్తుండటం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. అంజలి ప్రధాన పాత్రధారిలో రాజ్‌కిరణ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అంజలి'. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
దీనిపై రాజ్‌కిరణ్ స్పందిస్తూ శ్మశానం పేరు చెబితేనే చాలా మందికి భయం. ఆ ప్రదేశాన్ని ఆశుభంగా కూడా చాలా మంది భావిస్తుంటారు. అందువల్లే అటువైపు తలెత్తి చూసేందుకు కూడా భయపడుతుంటారు. అయితే, అంజలి కథానాయికగా రూపొందిన 'గీతాంజలి' సినిమా స్టోరీ శ్మశానంలో తయారైందని ఆయన చెపుతున్నారు. 
 
"శ్మశానంలో కూర్చుంటే మంచి థాట్ వచ్చింది. ఆ కథే గీతాంజలి. దీనికి మొదట్లో నేను పెట్టుకున్న పేరు 'టూ లెట్'. అయితే, చివరికి గీతాంజలిగా మారింది" అని చెప్పాడు. ఈ చిత్రం మంచి సక్సెస్‌ టాక్ రాబట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు రాజ్‌కిరణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.