శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (19:03 IST)

అక్రమంగా ఇళ్లు నిర్మాణం..? విక్టరీ వెంకటేశ్ కు జీహెచ్ఎంసీ నోటీసులు

ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్కు జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ప్లాటులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణల మేరకు ఆయనకు జీహెచ్ఎంసీ సర్కిల్-10 టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు పంపించారు.
 
ఫిలింనగర్ రోడ్ నెంబర్.1 లో హీరో వెంకటేశ్కు ప్లాటు ఉంది. గత కొద్దిరోజులుగా ఆ ప్లాటులో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీ అనుమతి లేకుండానే ఈ నిర్మాణాలు జరుగుతుండటంతో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. 
 
పది రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఈ సందర్భంగా వారు వెంకటేశ్‌ను జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.