శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:32 IST)

ఇండస్ట్రీలో సీరియస్‌నెస్‌ లోపించింది...గిరిబాబు

ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు ఎంతో గౌరవభావం ఉండేది. నటీనటులు సాంకేతిక సిబ్బంది కళామతళ్లిని గౌరవించేవారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఒకరినొకరు మర్యాదగా పలుకరింపులు వుండేవి. ఇప్పుడు అవి మృగ్యమయ్యాయి. సినిమా కథలు కూడా ఏమీ బాగోలేదని నటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబు తెలియజేస్తున్నారు. 
 
'మనం' సినిమా గురించి ఆయన చెబుతూ... ఇలాంటి కథలు అసలు సినిమా అంటే. గతంలో ఇలాంటి ఫీల్‌ గుడ్‌ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు కథలు లేవు. ఒకే మూసలో వస్తున్నాయి. ఇక సంగీతం అంటే.. దాన్ని సంగీతం అంటారా! అనేట్లుగా వున్నాయి. ఒక్కపాట ట్యూన్‌ కూడా గుర్తుకు రాదు. వాయిద్యాల హోరు ఎంత ఎక్కువగా వుంటే అదే బెటర్‌ అని అనుకుంటున్నారు. ఈ విధానం మారాలి అని చెప్పారు.