గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (12:05 IST)

గోన గన్నారెడ్డి గెటప్ అదిరిందోచ్: రుద్రమదేవిలో అల్లుఅర్జున్ ఇలా!

గోన గన్నారెడ్డి గెటప్ విడుదలైంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'రుద్రమదేవి' సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా ప్రత్యేక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త వచ్చినప్పటి నుంచీ ఇందులో బన్నీ లుక్ ఎలా ఉంటుందన్న విషయంపై అభిమానుల్లో ఉత్సుకత నెలకొంది. 
 
తాజాగా, దర్శకుడు ఈ గోన గన్నారెడ్డి గెటప్పును విడుదల చేశాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా బన్నీ గెటప్ ఫెరోషియాస్‌గా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం గ్రాఫిక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.