శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 25 జులై 2014 (14:55 IST)

కృష్ణాష్టమికి గోపాల గోపాల మొదటి దర్శనం అవునా...? చూద్దాం...

టాలీవుడ్ లో మరీ మల్టీస్టారర్ మూవీ "గోపాల గోపాల" చిత్రం గురించి పరిశ్రమలోనే కాదు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొన్నది. పవన్ కళ్యాణ్ మోడరన్ కృష్ణుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కృష్ణుడి గెటప్ లో ఎలా వుంటాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానులకు ఆగస్టు 17 న గోపాల గోపాల ఫస్ట్‌లుక్ ను విడుదల చేయబోతున్నారు.

కృష్ణాష్టమి రోజున విడుదల చేస్తున్న గోపాల గోపాల ఫస్ట్ లుక్ తో పాటు అక్టోబర్ 23న దీపావళి  పండుగ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారట. కాగా ఈ చిత్రం హిందీ ఓ మైగాడ్ చిత్రానికి రీమేక్ అని తెలిసిందే. ఇందులో వెంకటేష్, పవన్, శ్రియ, ప్రియమణి తదితరులు నటిస్తున్నారు.