గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 31 మార్చి 2015 (17:32 IST)

వెనకుండి నడిపించిన ప్రభాస్‌... గోపీచంద్ 'జిల్' సంతోషం

ప్రభాస్‌ చాలా బిజీ.. రాజమౌళి సినిమాకు రెండేళ్ళు పైగా డేట్స్‌ ఇచ్చాడు. ఆ టైంలో వచ్చిన ఆఫర్లు వేరేవారికి ఇచ్చేశాడు. అందులోనిదే 'జిల్‌'. ఈ సినిమాను గోపీచంద్‌ చేశాడు. ప్రభాస్‌ స్నేహితులు వంశీ, ప్రమోద్‌లు నిర్మాత. మిర్చి తీశారు. జిల్‌ సినిమా బాగానే ఆడుతుందనీ, ఇటువంటి సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు గోపీచంద్‌ ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు.
 
నాకు ఈ బేనర్‌తో హ్యాట్రిక్‌ అయినందుకు ఆనందంగా వుంది. అలాగే నా వెనుక వుండి నన్ను సపోర్ట్‌ చేసిన ప్రభాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. దర్శకుడు రాధాకృష్ణకుమార్‌ మాట్లాడుతూ... ఈ సినిమా కథను నిర్మాతలు నమ్మి తీశారు. మంచి సక్సెస్‌ సాధించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.