గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (12:34 IST)

బబ్లీ బ్యూటీ స్థలం కొనుగోలు..! ఎందుకు.. ఎవరికోసం..?

టాలీవుడ్‌లో ఎంటరై కోలీవుడ్‌లో వెలుగుతున్న బబ్లీ బ్యూటీ హన్సిక. ఈ అమ్మడు ముంబై శివారులోని వాధా ప్రాంతంలో ఒక ఎకరా స్థలం కొనుగోలు చేసిందట. అందుకోసం ఆమె కోట్లాది రూపాయలు వెచ్చించినట్టు సమాచారం. ఇంతకీ ఈ బ్యూటీ ఆ స్థలాన్ని ఎవరి కోసం కొనుగోలు చేసిందా అనే డైలమా అందరిలో నెలకొంది.
 
ఈ విషయం తెలుసుకున్న హన్సిక స్వయంగా తానే ఈ విషయం గురించి అభిమానులకు ఒక క్లారిటీ ఇస్తూ ట్విట్ చేసింది. అందులో ''అవును, ఇలాంటి ప్రాపర్టీ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ముంబయ్ నుంచి గంటన్నర ప్రయాణంలో ఈ స్థలం వుంది. చాలా మంచి లొకాలిటీలో దొరికింది" అని చెప్పింది. 
 
అయితే ఈ స్థలం తన కోసం కాదట. తాను దత్తత తీసుకున్న అనాథ పిల్లలకు శాశ్వత ఆశ్రమాన్ని కట్టించేందుకు ఈ స్థలాన్ని కొనుక్కున్నట్టు తెలిపింది. ఆశ్రమ నిర్మాణానికి మరికొంత సమయం తీసుకుంటుందని హన్సిక వెల్లడించింది హన్సిక.