శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (09:14 IST)

నిర్మాతలను బెదరగొడుతున్న బబ్లీ బ్యూటీ... రూ. 2 కోట్లు డిమాండ్..!

టాలీవుడ్‌లో ఆశించిన స్థాయికి ఎదగలేకపోయినా, తమిళంలో మాత్రం హన్సిక హవా కొనసాగిస్తోంది.  గత కొన్నాళ్లుగా కోలీవుడ్ లో చేతినిండా సినిమాలతో ఈ గుమ్మ బిజీబిజీగా వుంది. ప్రముఖ హీరోలు సైతం తమ సినిమాలో హీరోయిన్‌గా హన్సికనే కావాలంటూ పట్టుబడుతున్నాట. 
 
దీంతో ఈ అమ్మడూ పారితోషికాన్ని అమాంతం పెంచుకుంటూపోతోంది. ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న 'గరుడ' చిత్రానికి కోటిన్నర తీసుకుంటోంది. ఈ బ్యూటీ నటించిన మిగామాన్', 'అంబళ' సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. 
 
ఇంత వరకు బాగానే ఉంది. వీటి తర్వాత నటించే చిత్రాలకు ప్రస్తుతం తీసుకుంటున్నదాని కంటే ఎక్కువ కావాలని హన్సిక నిర్మాతలకు తెలుపుతోందట. అయితే ఆమె తల్లి మాత్రం రూ. రెండు కోట్లు ఇస్తేనే తన కుమార్తె నటించేందుకు అనుమతిస్తానంటూ తెగేసి చెప్పేస్తుందట. మరి అంత మొత్తం ఇస్తారో.. లేక వదులుకుంటారో వేచి చూడాల్సిందే.