గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (13:40 IST)

లిప్ లాక్ సీన్లలో నటించబోనంటున్న హన్సిక!

లిప్ లాక్ ముద్దు సన్నివేశాలలో ఇక హన్సిక నటించదట. ఇదేదో అశ్లీలమన్న ఉద్దేశంతో కాదట. మరెందుకనుకుంటున్నారా... జస్ట్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే! దీనికి ఓ కారణం కూడా వుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు వైరల్ ఫీవర్ వచ్చింది. దాంతో ఆమె ఆరోగ్యం అప్సెట్ అయింది. 
 
లిప్ లాక్ కిస్సు సీన్సులో నటించడం వల్ల ఇలాంటి వైరల్ జ్వరాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ చిన్నది ఇక వాటికి దూరంగా వుండాలని నిర్ణయించుకుంది. సో, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అధర చుంబనాలకు ఓకే చెప్పనని హన్సిక తీర్మానించుకుందట.