శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (13:57 IST)

విశాల్‌తో హన్సిక జోడీ: సుందర్ సి, ఖుష్బూ సంయుక్తంగా...

జూనియర్ ఖుష్బూ అని పేరు తెచ్చేసుకున్న హన్సికపై ఖుష్బూ భర్త సుందర్ సి వరాల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే అరన్‌మణై అనే థ్రిల్లర్, హారర్ సినిమాలో హన్సికను నటింపజేసిన సుందర్ సి.. తాజాగా తెల్లపిల్ల హన్సికతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 
 
ఈ సినిమాకు ''ఆంబల'' (మగాడు) అనే టైటిల్ ఖరారు చేసుకున్నాడు. ఇందులో ఓవర్ హైట్ విశాల్‌ను హీరోగా ఎంపిక చేసేశాడు. అయ్యగారికి జోడీగా హన్సికను సెలక్ట్ చేశాడు. 
 
ఇక ఈ సినిమా షూటింగ్‌ కోసం యూనిట్‌ను ఊటీకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఊటీలో ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను, పాటలను షూట్ చేస్తున్నారు. ఇందులో విశాల్ చాక్లెట్ బాయ్‌గా కనిప్తాడట. ఈ చిత్రాన్ని విశాల్, ఖుష్బూ కల్సి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్, హన్సికలకు ఇద్దరికీ తెలుగు మార్కెట్ ఉండడంతో ఏకకాలంలో తెలుగు వెర్షన్ కూడా తీస్తున్నారు. 
 
ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ ఇందులో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.