గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 17 సెప్టెంబరు 2014 (16:41 IST)

అతడికి 80 రోజులు చాల్లేదట... ఇంకా కావాలంటున్నాడు... హన్సిక

నటి హన్సిక.. తమిళంలో 'అరణ్యణై' అనే సినిమాలో నటించింది. కానీ అందులో ఆమె డేట్స్‌ ఇవ్వడం లేదని దర్శకనిర్మాతలు విమర్శిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై హన్సిక వివరణ ఇచ్చింది. ముందుగా ఆ సినిమాకు 60 రోజులు డేట్స్‌ ఇచ్చాను. కానీ దర్శకుడు కొత్త అవడంతో.. పూర్తిచేయలేకపోయాడు. మరో 20 రోజులు కలిపి 80 డేస్‌ ఇచ్చాను. కానీ అవ్వలేదు. 
 
మరలా ఇవ్వమంటే నా వల్లకాదు అని చెప్పాను. ఎందుకంటే ప్రస్తుతం రెండు చిత్రాల్లో బిజీగా వున్నాను. వాటిని పూర్తి చేయాలి. ఈ విషయంలో ఎవ్వరినీ నేను నిందించడం లేదని క్లారిటీ ఇచ్చింది.