శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 19 జనవరి 2015 (10:10 IST)

కష్టాల్లో బబ్లీ బ్యూటీ... యువరాణి కోసం పోరాటం...!

టాలీవుడ్‌లో పరిచయమై కోలీవుడ్‌లో వెలిగిపోతున్న బబ్లీ బ్యూటీ హన్సిక. ఇప్పుడీ అమ్మడు విజయ్ హీరోగా తమిళంలో రూపొందుతున్న 'పులి' సినిమాలో యువరాణి పాత్ర పోషిస్తోంది. ఇందుకు కోసం ఈ బ్యూటీ కత్తియుద్ధం కూడా నేర్చుకుంది. అంతా బాగానే ఉన్నా షూటింగ్ సమయాల్లో యువరాణిగా తన పాత్రను పండించేందుకు ఈ అమ్మడు తీవ్ర పోరాటం చేస్తుందట.
 
కత్తి యుద్ధం నేర్చుకుంటే సరిపోతుందా.. కత్తిపట్టి షూటింగ్ చేయాలి కదా.. అయితే ఈ సుకుమారి కత్తి పట్టిన కాసేపటికే చేతులు నొప్పులు అంటూ పక్కన కూర్చుంటుందట. ఒక సారి అయితే ఈ బ్యూటీ బాధ తట్టుకోలేక షూటింగ్‌ను కూడా రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో దర్శకుడు శింబుదేవన్‌కు చిర్రెత్తి యువరాణి కోసం ఆ పాత్రం నొప్పులు తట్టుకోలేకపోతే ఎలా అని చీవాట్లు పెట్టారట. దీంతో అమ్మడు కిమ్మని ఎంత నొప్పైనా భరించి షూటింగ్‌ను పూర్తి చేస్తుంది.