గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (13:02 IST)

ఆఫర్లు నిల్.. గెస్ట్ రోల్ అయినా ఇవ్వండి ప్లీజ్: హ్యాపీడేస్ సోనియా!

శేఖర్‌కమ్ముల హ్యాపీడేస్‌లో సీనియర్లను జూనియర్ క్వచ్ఛన్ చేయకూడదంటూ.. డైలాగ్ చెప్పి.. యంగస్టర్లను ఆకట్టుకున్న సోనియా గుర్తుందా.. ? ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు లేనేలేవట. అందుకే సోనియా గెస్ట్ రోల్ పర్లేదు చేస్తాననంటోంది. పాత్ర చిన్నదా? పెద్దదా? అని కాకుండా ఎలాంటి పాత్ర వచ్చినా చేసుకుంటూ పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని సోనియా చెప్పింది.
 
హీరోయిన్ రోల్స్ అని కాకుండా గెస్ట్ రోల్స్.. ఇతరత్రా పాత్రలు కూడా చేసేందుకు రెడీగా ఉన్నట్లు సోనియా చెబుతోంది. 'హ్యాపీడేస్' సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆఫర్లు లేకపోయినప్పటికీ, కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తూనే వుంది. 
 
ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ తమిళ సినిమాలో అతిథి పాత్ర చేస్తోంది.