గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (15:16 IST)

'మనం' దర్శకుడి ''24'' టైటిల్ లోగో రిలీజ్: సూర్య హీరోగా అదిరిపోద్దట!

'మనం' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న విక్రంకుమార్ తన తాజా చిత్రాన్ని సూర్యా హీరోగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు '24' అనే టైటిల్ ఖరారు చేశాడు. ఈ టైటిల్‌ను విక్రంకుమార్ రిలీజ్ చేశాడు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నెలాఖరులో ఇది సెట్స్ కి వెళుతుంది. కాగా, ఈ సినిమా టైటిల్ లోగోను దర్శకుడు తాజాగా ఆన్ లైన్లో రిలీజ్ చేశాడు.
 
"టైటిల్ అనుకున్న దగ్గర్నుంచీ రకరకాల లోగోలు చూశాను. 24 అనే నెంబర్ని ఎలా ప్లేస్ మెంట్ చేయాలా అని ఎంతగానో ఆలోచించాం. చివరికి ఈ లోగోను ఖరారు చేశాం. ఇది మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను" అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు విక్రంకుమార్ సమాచారాన్ని ఇచ్చాడు.