బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (15:56 IST)

జెనీలియాకు బుడంకాయ్‌ కాదు.. దేశ్‌ముఖే మళ్లీ పుట్టాడట!

జెనీలియాకు బుడంకాయ్ పుట్టాడు. అంతే రితేష్ దేశ్‌ముఖ్ ఎగిరి గంతేశాడు. తనకు రెండేళ్ల క్రితం చనిపోయిన తండ్రి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేశ్‌‌ముఖే కొడుకుగా పుట్టాడని సంతోషపడ్డాడు. 
 
మంగళవారం నాడు జెనీలియా పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా బయటి ప్రపంచానికి వెల్లడించాడు. Its a BBBOOOOYYYYYY అంటూ రితేష్ ట్విట్ చేశాడు. 
 
కాగా జెనీలియా నిండు గర్భిణిగా వున్నప్పటికీ హైదరాబాద్‌లో జరిగిన సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ పెళ్ళికి వచ్చింది. 2003 సంవత్సరంలో ‘తుఝే మేరీ కసమ్’ సినిమాలో కలసి నటించినప్పుడు రితేష్, జెనీలియా ప్రేమలో పడ్డారు. 
 
తొమ్మిది సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత 2012లో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. రితేష్, జెనీలియా దంపతులకు కొడుకు పుట్టాడన్న విషయం తెలిసిన అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు ట్విట్లతో వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.