గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (15:55 IST)

జెనీలియాకు అబ్బాయ్: ట్వీట్స్.. Big hug @geneliad and Riteish!

జెనీలియాకు మంగళవారం అబ్బాయి పుట్టాడు. దీంతో రితేష్ ఆనందాలకు హద్దుల్లేకుండా పోయాయి. తనకు కుమారుడు పుట్టాడన్న విషయాన్ని ట్వీట్టర్ ద్వారా తెలియజేసిన రితేష్‌కు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
 
ఈ క్రమంలో బాలీవుడ్ తారలంతా జెనీలియా దంపతులకు అభినందలు తెలిపారు. జెనీలియా-రితేష్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో కరణ్ జోహార్, అభిషేక్ బచ్చన్, సిద్ధార్థ్, లారా దత్త భూపతి, బిపాసా బసు, నిఖిల్ అద్వానీ, అర్జున్ కపూర్ తదితరులు ఉన్నారు. 
 
వీరిలో బిపాసా బసు @Riteishd and @geneliad ! Woohoo! Daddy n mommy! Congrats! Lil baby boy! Wow! అని ట్వీట్ చేయగా, జెన్నీతో తమిళంలో తొలి సినిమాలో నటించిన సిద్ధార్థ్ "@Riteishd: It's a BBBOOOOYYYYYY!!!!!!!!" Wonderful news!! God bless the new born and his amazing parents. Big hug @geneliad and Riteish :) అంటూ ట్వీట్ చేశాడు.