శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (14:42 IST)

హృతిక్ రోషన్ కోసం ఆఫర్లొద్దంటున్న పూజా హెగ్డే!

హృతిక్ రోషన్ సినిమా కోసం పూజా హెగ్డే ఎన్నో ఆఫర్లు వదిలేసుకుందట. ఒక లైలా కోసం సినిమా ద్వారా పరిచయమైన ఈ అందాల కన్నడ కస్తూరి త్వరలో విడుదలయ్యే ముకుంద సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఈ అమ్మాయి అందచందాలు చూసిన పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో నటించాల్సిందిగా ఆఫర్లు ఇచ్చారట. అయితే, అందరికీ సారీ చెప్పేసింది. కారణం... త్వరలో తాను హృతిక్ రోషన్ హీరోగా నటించే 'మొహంజదారో' సినిమాలో నటిస్తున్నానని క్లియర్ కట్‌గా చెప్పేసింది. 
 
దీని గురించి ఈ ముద్దుగుమ్మ చెబుతూ, "అసలు కలలో కూడా ఊహించని ఆఫర్ 'మొహంజదారో' సినిమా ద్వారా వచ్చింది. వచ్చే నెల నుంచి ఆరు నెలల పాటు ఆ భారీ చిత్రానికి డేట్స్ ఇచ్చేశాను. దాంతో, చాలా తెలుగు సినిమాలు వదులుకున్నాను. మీకో విషయం తెలుసా? మణిరత్నం సార్ ఇచ్చిన ఆఫర్ కూడా వదిలేయాల్సివచ్చింది.

చిన్నప్పటి నుంచీ నేను మణి సార్ సినిమాలు చూస్తూ పెరిగినదాన్ని. ఆయనంటే ఎనలేని గౌరవం. కానీ, ఏం చేయను? ఆయనకి 'నో' చెబుతున్నప్పుడు గుండె పగిలింది. ఆయనని కలసి మరీ సారీ చెప్పాను" అని పూజా హెగ్డే వివరించింది.