బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 26 నవంబరు 2014 (18:22 IST)

చందాలివ్వండి బాబూ...

ఘనకార్యం చేస్తున్నాం చందాలివ్వండి బాబూ.. అంటూ ప్రజలను వేడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర వాణిజ్యమండలి కార్యవర్గం. ఇటీవలే హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితుల సహాయార్థం ఈనెల 30న తలపెట్టిన వినోదకార్యక్రమాలు, క్రికెట్‌మ్యాచ్‌లు మొదలైనవి చేయడానికి 500 రూపాయల నుంచి లక్షల రూపాయట టిక్కెట్ల కోసం ప్రకటనలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి 'మా'టీవీ అధికారికంగా హక్కులు పొందింది. అయితే ఆ పబ్లిసిటీ వల్ల పెద్దగా లాభంలేదని.. ఇంకా పలు మీడియాలను పిలిచి రోజూ ఏదో కార్యక్రమం కింద ఛాంబర్‌ కార్యవర్గం వివరాలు తెలియజేస్తుంది. 
 
బుధవారంనాడు ఛాంబర్‌ అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎన్‌విఎస్‌ ప్రసాద్‌లు మాట్లాడుతూ... 500 రూపాయల కూపన్స్‌ కోసం ప్రజలు ఇంకా తరలిరావాలని, లక్కీడీప్‌ తీయడానికి ఒక్కరోజే వ్యవధి వున్నందున మీడియా అంతా దీని గురించి రాయండి అంటూ వేడుకుంటున్నారు. 
 
ఇంతకీ 500 రూపాయలు టోక్‌ను తీసుకుంటే అందులో డ్రా తీసి 45మందికి ఎంపిక చేస్తాం.వారు మాత్రమే స్టార్స్‌తో కలిసి క్రికెట్‌ చూసేందుకు అర్హులు. మిగిలినవారు తుఫాను బాధితులకు సాయం చేశామని ఇంట్లోకూర్చొని టీవీల్లో చూడవచ్చట.