శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 ఫిబ్రవరి 2015 (17:51 IST)

మేకప్ లేకపోయినా.. నేను అందంగా ఉంటాను.. కాజల్ అగర్వాల్

సాధారణంగా హీరోయిన్స్ మేకప్ వేసుకుంటే ఒక విధంగా, మేకప్ లేకుండా వేరొక విధంగా ఉంటారు. అయితే తనకు అలాంటి సమస్యే లేదంటోంది.. చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్. మేకప్ లేకపోయినా మిగిలిన హీరోయిన్స్‌లా కాకుండా తాను అందంగా ఉంటానని చెప్పుకొచ్చింది. 
 
ఇంట్లో ఉంటే సాధారణంగా ఉండిపోతానని.. తనను చూసిన చాలామంది మేకప్ లేకపోయినా అందంగా ఉంటారని పొగుడుతున్నట్లు కాజల్ అగర్వాల్ తెలిపింది. సమస్యల గురించి పట్టించుకోకపోవడం, షూటింగ్ పూర్తయ్యాక సహచరులతో క్యాజువల్‌గా ఉంటానని కాజల్ చెప్పింది. 
 
చందమామ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్ అగర్వాల్ టాలీవుడ్, కోలీవుడ్‌‌తో పాటు బాలీవుడ్‌లోనూ అనేక సినిమాలు నటించి అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.