శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (15:25 IST)

''ఐ'' కోసం రెహ్మాన్: చెన్నైలో రీరికార్డింగ్ ప్రారంభం!

''ఐ'' సినిమా కోసం పనిచేసేందుకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ రెడీ అయ్యారు. ప్రముఖ దర్శకుడు రూపొందిస్తున్న ఐ సినిమాకు సంబంధించిన రీరికార్డింగ్ మొదలైంది. ఈ కార్యక్రమాలను రెహ్మాన్ చెన్నైలోని తన స్టూడియోలో ప్రారంభించారు. 
 
చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు చాలా ప్రాధాన్యత ఉండడంతో సంగీత దర్శకుడు, దర్శకుడు ఇద్దరూ ఎంతగానో చర్చించుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారట. దీనికి కాస్త ఎక్కువ సమయం పట్టేలా వుండడం వల్లే దీపావళికి విడుదల కావలసిన ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. 
 
నవంబర్ 21 లేదా 28 తేదీల్లో ఏదో ఒక తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఇప్పుడు దర్శక నిర్మాతలు కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో విక్రం, ఎమీ జాక్సన్ జంటగా నటించారు.