శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:03 IST)

మరో జన్మ ఉంటే.. సల్మాన్‌లా పుట్టాలనుంది.. సన్నీ హొయలు..!

బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీ లియోన్ తాజా చిత్రం 'ఏక్ పహేలీ లీలా'. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో సన్నీ తాజాగా ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు మరో జన్మ అంటూ ఉంటే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌లా పుట్టాలనుంది అని తెలిపింది. 
 
మీ రాబోయే చిత్రం పునర్జన్మ ఆధారంగా రూపొందినందున, మళ్లీ మరొకరిలా పుట్టాలనుకుంటే, ఎవరిలా పుట్టాలనుకుంటారు అని అడిగిన ప్రశ్నకు సన్నీ సమాధానమిస్తూ "సల్మాన్ ఖాన్ లా తిరిగి రావాలనుకుంటున్నా. ఇండియాలోని పెద్ద స్టార్లలో ఆయనొకరు.

ప్రజలు ఆయనంటే భయపడుతున్నారు. కానీ అదే సమయంలో వాళ్లు సల్మాన్ ను ప్రేమిస్తారు కూడా. తను చాలా చాలా స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. చాలా మంచి మనిషి" అని చెబుతూ సల్మాన్‌ను పొగడ్తలతో ముంచెత్తింది.