బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 26 మే 2015 (12:13 IST)

'బాహుబలి' క్రేజ్... క్యూకట్టిన కంపెనీలు.. ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ అవుతాడా?

టాలీవుడ్ ‌సినిమా స్టార్స్ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉంటూ కొంత డబ్బు వెనకేసుకుంటున్నారు. ఆ వరుసలో ముందుండేది మహేష్ బాబు. కార్పోరేట్ కంపెనీలన్నిటికీ దాదాపు ఆయనే ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. 
 
ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అఖిల్, రవితేజలు  పలు సంస్థలకు అంబాసిడర్‌లుగా ఉంటున్నారు. వీరి వరసలో తాజాగా బహుబలి హీరో చేరిపోనున్నారు. ఇప్పటికే పోస్టర్స్, మేకింగ్ వీడియోలతో రాజమౌళి బాహుబలి సినీ లవర్స్‌ని ఆకట్టుకుంటుంది.
 
అయితే అందులో బహుబలుడిగా ప్రభాస్ పాత్రకి క్రేజ్ బాగా ఉన్నది. ఈ పాయింట్‌ని క్యాచ్ చేసిన కార్పోరేట్ కంపెనీలు తమ ప్రచారకర్తగా ప్రభస్‌ని పెట్టుకునే ఆలోచనలో ఉన్నాయట. ఇప్పటికే పలు కంపెనీలు ప్రభాస్‌ని కలసి డీల్ కుదుర్చుకుందామని ప్రపోజల్‌లో ఉన్నాయట. అయితే ప్రభాస్ మాత్రం ఆచితూచి అడుగు వేయాలని అనుకుంటున్నాడట. తెలుగులో తప్ప ప్రభాస్‌కి సౌత్‌లో ఎక్కడ క్రేజ్ లేదు. వరుసగా ఓ రెండు మూడు హిట్లు తప్ప పాపులారిటీ అంతగా లేదు.
 
ఇప్పుడు బాహుబలి విడుదల తర్వాత తన ఇమేజ్, పాపులారిటీ పెరుగుతుందని భావిస్తున్నాడు ప్రభాస్. అందుకే సినిమా విడుదల తర్వాత కార్పోరేట్ కంపెనీల యాడ్స్ అంగీకరించాలని అనుకుంటున్నాడట. ఆ సినిమా సక్సెస్‌ని క్యాష్ చేసుకొని మహేష్‌కి పోటీగా కార్పోరేట్ బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా నిలవాలనే ఆలోచనతో ప్రభాస్ ముందుకువేల్తున్నాడు.