శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 ఆగస్టు 2014 (14:50 IST)

ఇలియానా చేతిలో అభిమాని చీటీ... చిందులేసిన గోవా బ్యూటీ

బక్కపలుచని గోవా బ్యూటీ ఇలియానా అంటే కుర్రకారు గుడ్లప్పగించి అలా చూస్తుండిపోతారు. అలాంటి భామ ఈమధ్య ముంబై విమానాశ్రయంలో దిగిందట. అసలే సెక్సీ భామ... ఆపై మరింత సెక్సియెస్ట్ డ్రెస్సులో కనబడేసరికి విమానాశ్రయంలో ఉన్న జనమంతా ఇలియానా వైపుకు పరుగులు తీశారట. ఆమె అందాన్ని కళ్లతోనే గుచ్చిగుచ్చి చంపేశారట. 
 
ఇంతలో పోలీసులు వారిని వారిస్తుంటే వెనుక నుంచి ఓ అభిమాని అందర్నీ తోసుకుంటూ వచ్చి ఇలియానా చేతిలో గబుక్కున ఓ చీటి పెట్టి తర్వాత చదువుకోండంటూ పరుగులు తీశాడట. అందులో ఏం రాశాడని అక్కడున్నవారంతా అడిగినా ఇలియానా మాత్రం అప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిందట. 
 
కానీ తాజాగా ఆ విషయంపై తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అదేంటయా అంటే, ఇలియానా నువ్వు సినిమాలో అయినా బయటయినా సూపర్ సెక్సీగా ఉంటారు. బర్ఫీలో మీ అందాల్ని చూసి ప్లాటయిపోయా. మీరు మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా అంటూ రాశాడట. ఈ విషయాలు ఇలియానా గుండెలకు హత్తుకున్నాయట. అందుకే వాటిని తన ట్విట్టర్లో పెట్టింది ఇలియానా.