మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (12:41 IST)

తలకోనలో 'పులి'... ఇంట్రడక్షన్ పాటకు రూ. 5.2 కోట్లు..!

కోలీవుడ్ టాప్ హీరో విజయ్ తాజా చిత్రం 'పులి'. శింబుదేవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళం‌, హిందీ అంటూ మూడు భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌గానీ, సినిమా స్టిల్స్‌గానీ ఇప్పటివరకు బయటికి రాలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి. 
 
ఈ చిత్రంలో విజయ్‌, శృతి హాసన్‌, హన్సిక, ఆలిండియా స్టార్‌ శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తుంది.
 
ఇన్నాళ్లు చెన్నై, కేరళలో షూటింగ్ జరుపుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు తిరుపతి సమీపంలోని తలకోన అడవుల్లోకి చేరుకుందట. ఇక్కడ ఇంట్రడక్షన్ పాటను చిత్రీకరించనున్నట్టు సమాచారం. అయితే ఇందులో విశేషమేమిటంటారా...
 
ఈ పాట చిత్రీకరణ కోసం ఏకంగా ఐదు కోట్ల 20 లక్షల రూపాయలను ఖర్చు చేశారట. లొకేషన్ దట్టమైన అడవి కావడంతో రోడ్డు సదుపాయం కూడా సరిగ్గా లేవు. దీంతో షూటింగ్‌ స్పాట్‌కి వెళ్ళడం కోసం రోడ్లు, ఉడెన్‌ బ్రిడ్జ్‌లు నిర్మించారు. ఈ ఫారెస్ట్‌లో 200 మంది కార్పెంటర్స్‌, 100 మంది మౌల్డర్స్‌, 50 మంది వెల్డర్స్‌ 100 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి భారీ విలేజ్‌ సెట్‌ని నిర్మించారు. 
 
అంతేకాకుండా ఈ ఇంట్రడక్షన్ పాటలో 300 మంది జూనియర్‌ ఆర్టిస్టులు, ముంబాయి, చెన్నై‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి వచ్చిన 200 మంది డ్యాన్సర్లు కూడా పాల్గొంటున్నారు. ఈ పాట కోసం 250 మంది టెక్నీషియన్స్‌ వర్క్‌ చేస్తున్నారు.
 
ఈ భారీ సెట్‌లో హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు. ఇందులో విజయ్‌తోపాటు శృతి హాసన్‌, ప్రభు, తదితరులు పాల్గొంటారు. శ్రీధర్‌ మాస్టర్‌ నృత్యదర్శకత్వంలో చిత్రీకరిస్తున్న ఈ పాటను ఒక పండగ వాతావరణం తలపించేలా ఎంతో భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ పాటను 5 కోట్ల 25 లక్షల రూపాయలు భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించిన ఏకధాటిగా 115వ రోజు షూటింగ్‌ జరుపుకుంటోంది.